కలం, తుర్కపల్లి : యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో బుధవారం నాడు ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్ (Turkapally Press Club) కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ సమావేశంలో తుర్కపల్లి మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మండల కేంద్రానికి చెందిన పెండెం రవి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షుడిగా ఆరే నర్సింహులు, ఉపాధ్యక్షులుగా అక్కారం కృష్ణ, కొండం నాగరాజు, ఆకుల శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొలనుపాక కొండల్ కనకరాజు, ప్రధాన కార్యదర్శిగా పులిగిల్ల స్వామి, కోశాధికారి ఎం.డి.చాంద్ పాషా, సహాయ కార్యదర్శులు గడిపె ఇంద్రయ్య, ఆకుల రాజుకుమార్, గౌరవ సలహాదారులు షేక్ బురాన్, ప్రచార కార్యదర్శిగా పుట్ట అంజనేయులు, సంయుక్త కార్యదర్శులుగా తునికి శ్రీనివాస్, కర్రె ఉపేందర్ గౌడ్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు పెండెం రవి మాట్లాడుతూ విలేకరుల సమస్యలతో పాటు మండల ప్రజల సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు ఆదిమూలం సురేష్, బేతాల బాబు, ఆకుల నవీన్, పుట్ట కార్తీక్, కొత్తింటి సురేష్, సుంకి శివ లను ఎన్నుకున్నారు.

