కలం, వెబ్ డెస్క్ : హెచ్ఎన్ జీ సినిమాస్.. ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సఃకుటుంబానాం (Sahakutumbanam Movie). రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు.
మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఎడిటర్ గా శశాంక్ మలి చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు సోషల్ మీడియా ద్వారా మంచి ప్రశంసలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న “సఃకుటుంబానాం” చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడగా ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా 2026 జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
2026 సంవత్సరంలో అందరి జీవితాలు మరింత వెలుగు పొందాలని ప్రేక్షకులకు న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ “సఃకుటుంబానాం” చిత్ర బృందం నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1వ తేదీన Sahakutumbanam Movie విడుదల కానుందని ప్రకటించారు.


