బ్రెజిల్‌కు ముందు పనామాతో భారత్ ఢీ!

కలం, స్పోర్ట్స్​ : బ్రెజిల్‌తో మ్యాచ్‌కు ముందు భారత ఫుట్‌బాల్ జట్టుకు గట్టి పరీక్ష ఎదురైంది. సెప్టెంబర్ 26న పనామాతో భారత్ అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ విషయాన్ని AIFF మంగళవారం ప్రకటించింది. మ్యాచ్ వేదికను త్వరలో వెల్లడించనున్నారు. భారత్, పనామా (India vs Panama) జట్లు తొలిసారి తలపడనున్నాయి. FIFA ర్యాంకింగ్స్‌లో పనామా 44వ స్థానంలో ఉంది.

2026 ప్రపంచకప్‌లోనూ ఆ జట్టు పాల్గొంది. కోచ్ ఖలీద్ జమీల్ జట్టుకు పనామాతో మ్యాచ్ కీలక పరీక్ష కానుంది. ప్రపంచకప్‌లో ఆడిన జట్టుతో తలపడటం భారత ఆటగాళ్లకు మంచి అనుభవాన్ని ఇస్తుందని AIFF తెలిపింది. పనామాతో మ్యాచ్ తర్వాత భారత్ అక్టోబర్ 3న బ్రెజిల్‌తో ఆడనుంది. ఆ తర్వాత నవంబర్ 12, 15 తేదీల్లో న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల ద్వారా ప్రపంచకప్ స్థాయి జట్లతో ఆడే అవకాశం భారత ఆటగాళ్లకు దక్కనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>