అర్హులైన ప్రతి ఓటు జాబితాలో ఉండేలా చూడాలి: తాహెర్, శ్రీహరి

కలం, నిర్మల్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తుందని నిర్మల్ (Nirmal) జిల్లా నేతలు తెలిపారు. ఈ సభలకు కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంటులు తప్పనిసరిగా హాజరు కావాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, ఎస్‌ఐఆర్ నిర్మల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తాహెర్ బీన్ ఆమ్దాన్, కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు తెలిపారు. అణమాలిస్, అన్ మ్యాప్డ్, అన్ డిజిటలైజ్డ్ ఓట్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అర్హత కలిగిన ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. ఒక్క అర్హత కలిగిన ఓటు కూడా జాబితా నుంచి నష్టపోకుండా చూడాలన్నారు. బీఎల్‌ఏలు సమగ్ర డేటాతో గ్రామ సభలకు హాజరై ప్రతి ఓటును పరిశీలించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>