కలం, వెబ్‌డెస్క్: కొండా సురేఖ (Konda Surekha), చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ని కోరినట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి (Mallu Ravi) వెల్లడించారు. పీసీసీ చీఫ్‌కు వీరి వ్యవహారంపై నివేదిక అందించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిపై చర్యలు తీసుకోకుంటే పార్టీకి మరింత నష్టమని స్పష్టం చేశారు. కొండా సురేఖను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరినట్లు వెల్లడించారు.
పలుమార్లు హెచ్చరించినా ఆమెలో మార్పు రావడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారెడ్డిని వెంటనే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని పేర్కొన్నారు. వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యమన్నారు. క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేసిన చిన్నారెడ్డి.. ఇలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదని పేర్కొంది. ఈ నివేదికను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ పెద్దలకు మెయిల్ చేసినట్లు మల్లు రవి పేర్కొన్నారు.

