బీసీ హక్కుల సాధనే లక్ష్యం: తెలంగాణ రక్షణ సేన

కలం, కరీంనగర్: దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం విశేష కృషి చేసిన మహనీయుడు బి.పి. మండల్ అని తెలంగాణ రక్షణ సేన (Telangana Rakshana Sena) నాయకులు కొనియాడారు. బి.పి. మండల్ జయంతిని(BP Mandal Jayanti) పురస్కరించుకుని కరీంనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన బీసీ విభాగం అధ్యక్షుడు శ్రీరాముల రమేష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలన్న బి.పి. మండల్ ఆశయం చారిత్రాత్మకమైనదని అన్నారు. ఆయన నేతృత్వంలోని మండల్ కమిషన్ చేసిన సిఫారసులు బీసీ వర్గాల రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో నూతన అధ్యాయానికి బాటలు వేశాయని పేర్కొన్నారు.

సమాజంలో కొనసాగుతున్న సామాజిక అసమానతలను తొలగించి, అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బి.పి. మండల్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అణగారిన, వెనుకబడిన వర్గాలకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, నాయకులు రంగరవేణి లక్ష్మణ్, కుతాడి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, గర్షకుర్తి విద్యాసాగర్, పుసాల పవన్, నూతి చరణ్, కొత్వాల అశోక్, ఎండి హుస్సేన్, జిల్లా మహిళా విభాగం నాయకురాళ్లు జంగ అపర్ణ, ఎండి సల్మా, దాసరి అంజలి, నేరెల్ల గంగా, ఎండి శాభాన తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>