మహేశ్ కొత్త మూవీపై క్రేజీ అప్డేట్.. ఆయనే డైరెక్టర్?

కలం, వెబ్ డెస్క్: రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’తో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ 80 శాతం జరిగిందని.. అక్టోబర్ నాటికి మొత్తం పూర్తి చేస్తామని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. 2027 ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహేశ్ తరువాత చేయబోయే ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొందరు బాలీవుడ్ డైరెక్టర్లు కథలు కూడా వినిపించారని టాక్. తాజాగా వచ్చిన ఓ అప్డేట్ మాత్రం ఆసక్తికంగా మారింది. మహేశ్ తన తదుపరి మూవీతో అనిల్ రావిపూడితో చేయబోతున్నారని, కథా చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఇంకా ఫైనల్ కాలేదు.

అదే జరిగితే రెండో మూవీ..

మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి ఇప్పటికే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దేశ భక్తి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో మహేశ్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించారు. ఈసారి కూడా సూపర్ స్టార్ కోసం ఒక డిఫరెంట్ స్టోరీని అనిల్ రావిపూడి రెడీ చేశారట. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే వారణాసి విడుదల కాకముందే, సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వారణాసి వంటి పాన్ వరల్డ్ మూవీ తరువాత అనిల్ రావిపూడితో రెండో మూవీ చేస్తారా..? లేకపోతే మరొకరికి అవకాశం ఇస్తారా..? అనేది వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>