కలం, నిర్మల్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు నిర్మల్ జిల్లా బీజేపీ నాయకులు (Nirmal BJP) మంగళవారం హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఈ సమస్య పరిష్కారం కోసం బీజేపీ చేస్తున్న పోరాటానికి విద్యార్థులు, తల్లిదండ్రులు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, సీనియర్ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవిపాండే, నారాయణరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గంగాధర్, జిల్లా కార్యదర్శి తాడేవార్ సాయినాథ్, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు చొప్పారి వెంకటేష్, కాసరోల్ల ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

