కాంగ్రెస్ ప్రచారంలో సోషల్ మీడియా కీలకం: ఆదిత్యరెడ్డి

కలం, వనపర్తి : టీపీసీసీ సోషల్ మీడియా నూతన చైర్మన్ గా ఎన్నికైన పెట్టం నవీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఏఐపీసీ అధ్యక్షుడు డాక్టర్ జిల్లెల ఆదిత్యరెడ్డి (Aditya Reddy) హాజరయ్యారు. నవీన్‌కు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా ఆదిత్యరెడ్డి మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. యువతను కాంగ్రెస్ పార్టీతో మరింతగా అనుసంధానం చేయడంలో నవీన్ నాయకత్వం దోహదపడాలని ఆకాంక్షించారు.

పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంచడంలో సోషల్ మీడియా ముఖ్యమైన సాధనమని తెలిపారు. నవీన్ తనకు అప్పగించిన కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉందన్నారు.

ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత బాధ్యతలు చేపట్టాలని డాక్టర్ ఆదిత్యరెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్‌తో పాటు రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, వివిధ జిల్లాలకు చెందిన సోషల్ మీడియా విభాగం నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>