కలం, వెబ్ డెస్క్: పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam)లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి అయిదుగురు సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. వడ్డెర సత్రంలో ఈ నెల 20న రూం తీసుకున్న కుటుంబం.. గత మూడు రోజులుగా బయటకు రాకపోవడంతో నిర్వాహకులు అనుమానంతో లోపలికి వెళ్లి చూశారు. అయిదుగురు విగతజీవులుగా పడి ఉండటం చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు.
వీరంతా శ్రీ సత్యసాయి జిల్లా బత్తులపల్లి గ్రామానికి చెందిన సుధాకర్, ఆదిలక్ష్మి, మల్లీశ్వరి, శ్రీదేవి మణికంఠగా గుర్తించారు. ఆర్థిక సమస్యల కారణంగానే.. శ్రీశైలంలో చనిపోవాలని ముందే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దర్శనం అనంతరం బలవన్మరణానికి పాల్పడ్డారు. వాష్ రూంలో ముగ్గురు, హాల్లో ఇద్దరు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

