కలం, వెబ్ డెస్క్: సరైన కథ, అందుకు తగ్గట్టుగా అద్భుతమైన నటన తోడైతే.. బాక్సాఫీస్ వద్ద ఏ మూవీ అయినా రికార్డులు కొల్లగొట్టడం ఖాయం. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇరుముడి (Irumudi) మూవీతో సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు. కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో వేగంగా సరికొత్త రికార్డును అందుకున్న హీరోగా రికార్డు సృష్టించారు.
అలాగే తెలుగు రాష్ట్రాల్లో రీజినల్ సినిమాల చరిత్రలోనే ఏ సినిమాకూ సాధ్యం కాని విధంగా తొలి సోమవారం అత్యధిక బుకింగ్స్ నమోదు కావడం విశేషం. ఏకంగా మొదటి రోజుకు సమానంగా ఈ భారీ బుకింగ్స్ కొనసాగుతుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ‘బాహుబలి 2’ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అరుదైన బాక్సాఫీస్ ఫినామినన్ మళ్లీ ఇప్పుడే కనిపించడం గమనార్హం.
ఈ సినిమాకు వస్తున్న ఆదరణకు బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ‘బుక్‌మైషో’, ఇతర యాప్‌ల ద్వారా ఏకంగా 3.6 మిలియన్లకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక నాలుగో రోజు ఏపీ, తెలంగాణల్లో రికార్డు స్థాయి ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ జోరు ఐదో రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

