కలం, నిజామాబాద్ బ్యూరో: తమ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) ఆందోళనలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ ఈ నెల 18న నిర్వహించిన విస్తృతస్థాయి కార్యనిర్వాహక సమావేశంలో పలు తీర్మానాలు చేసింది. రాష్ట్ర TGEJAC చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన నిజామాబాద్ టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో అత్యవసర జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర TGEJAC ప్రకటించిన ఉద్యమ కార్యాచరణపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఉద్యమ కార్యాచరణను అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అదనపు కలెక్టర్ భుజంగరావు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ప్రకాష్‌కు వినతిపత్రాలు అందజేశారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ ప్రకటించిన కార్యాచరణను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్‌తో పాటు TGEJAC జిల్లా నాయకులు నేతికుంట శేఖర్, ధర్మేందర్, నేరెళ్ల శ్రీనివాస్, రాజారాం, పండరినాథ్, గంగా కిషన్, పోల శ్రీనివాస్, నిరంజన్ గౌడ్, శివకుమార్ గౌడ్, జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, మారుతి అశ్విన్ కుమార్, బీరేందర్ సింగ్, సునీల్, స్వామి, చైతన్య, ప్రసాద్, సలహాదారు వనమాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

