విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ పోరుబాట

కలం, కరీంనగర్ :  రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆగస్టు 24, 25 తేదీల్లో చేపడుతున్న రెండు రోజుల నిరాహార దీక్షకు సంఘీభావంగా కరీంనగర్ (Karimnagar) బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. కరీంనగర్ బస్టాండ్ అవుట్ గేట్ ఎదుట నిర్వహించిన ఈ దీక్షలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు అర్ధాంతరంగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని సాయిని మల్లేశం అన్నారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల చెల్లింపు కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, దీంతో సర్టిఫికెట్లు అందక, పరీక్షలకు హాజరుకాలేక విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం ఇచ్చే బిక్ష కాదని, అది విద్యార్థుల హక్కు అని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పేరుకుపోయిన బకాయిలన్నింటినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులు, వారి భవిష్యత్తు కోసం బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని వీడి బకాయిలు విడుదల చేయకపోతే రాంచందర్ రావు నాయకత్వంలో రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

 రూ.12 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలి

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, అడిచెర్ల రాజు, అవదుర్తి శ్రీనివాస్, కార్పొరేటర్ కొమురయ్య, నాయకులు పెద్దపల్లి జితేందర్, గుంజేటి శివ, సుధాకర్ పటేల్, వెంకటేష్, మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ తదితరులు ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా ప్రభుత్వం తక్షణమే రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ కోలగాని శ్రీనివాస్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, కన్నా కృష్ణ, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్ రావు, జిల్లా కార్యదర్శి సీహెచ్ నరసింహరాజు, మీడియా కన్వీనర్ చేపూరి సత్యం, మండల అధ్యక్షులు మడిశెట్టి సంతోష్, కంది రాజిరెడ్డి, చింతం శ్రీనివాస్, తనకు సాయికృష్ణ, పాదం శివరాజ్, కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, దేశీ శిల్పా, పెద్దపల్లి శ్రీలేఖ, తాటి ప్రభావతి, మాసం గణేష్, భూపతి రవీందర్, తోట అనిల్, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు గుర్రాల నిర్మల రెడ్డి, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మోతే గంగారెడ్డి, వెంకట్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అడిచెర్ల రాజు, రమేష్ దూలం, కిరణ్, ఆవుల తిరుపతి, రవి ప్రసాద్, గుర్రం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>