కలం, వెబ్ డెస్క్ : నా అన్వేషన అన్వేష్ (Anvesh) మరో వీడియో వదిలాడు. హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలుచేయడంతో ఇప్పటికే చాలా మంది అన్వేష్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. వీహెచ్ పీతో పాటు మరికొన్ని సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలోనే అన్వేష్ హిందూ కాదంటూ, యాంటీ నేషన్ అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వాటిపై తాజా వీడియోలో రియాక్ట్ అయ్యాడు అన్వేష్.
‘నేను హిందువు కాదని చెప్పడానికి మీరెవరు. నేను హిందూ ధర్మంలోనే పుట్టాను. కిలి మంజారో కొండ ఎక్కి వినాయకుడిని పూజించాను. 60 రోజులు ఉపవాసం ఉంటూ మహాభారతం చెప్పాను. త్వరలోనే రామాయణం, భగవద్గీత కూడా చెప్తాను. అది నా ఇష్టం. 128 దేశాల్లో హిందూ గుడులను తిరిగి చూపించాను. నేను హిందువును కాబట్టే ఇదంతా చేశాను. ఇండియాలో ఉన్న జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు కూడా తిరిగి చూపించాను. ఏ యూట్యూబ్ ఛానెల్ వాళ్లు ఇలా చూపించలేదు. నేను హిందువును కాబట్టే ఇవన్నీ చూపించాను. నేను యాంటినేషన్ అంటున్నారు. నేను ఇండియాలో లేకపోయినా ట్యాక్స్ కడుతున్నాను. ఇండియా బాగుండాలనే నా ఉద్దేశం. మీరు నాపై ఎన్ని ఆరోపణలు చేసినా నాకేం ఇబ్బంది లేదు. మీకు కర్మ ఎప్పుడో ఒకసారి రిటర్న్ అవుద్ది’ అంటూ చెప్పుకొచ్చాడు అన్వేష్(Anvesh).
Read Also: జెలెన్ స్కీకి పుతిన్ క్రిస్మస్ కానుక…
Follow Us On: Pinterest


