కలం, అశ్వారావు పేట: బీఆర్‌ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి, అందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తానని మాజీ ఎమ్మెల్యే, అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి మెచ్చా నాగేశ్వరరావు (Mecha Nageswara Rao) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి (Annapureddypally) మండలంలో విస్తృతంగా పర్యటించారు. మర్రిగూడెం, అన్నపురెడ్డిపల్లి, పెంట్లం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురి నివాసాలకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.
కార్యకర్తలకు సరైన గుర్తింపు..
కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, కష్టపడే వారికి పార్టీలో సరైన గుర్తింపు లభిస్తుందని భరోసా మెచ్చా నాగేశ్వరరావు (Mecha Nageswara Rao) ఇచ్చారు. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తవుతున్నా అమలు చేయలేదన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ రెండో తేదీ నుంచి వారం రోజులపాటు ‘కాంగ్రెస్ 1000 రోజుల దగా’పై బాకీ కార్డులతో గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్‌రావు, సర్పంచి కారం శివ, నాయకులు కృష్ణారెడ్డి, లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
Also Read : కాంగ్రెస్ విద్యావిధానాలపై కొప్పుల ఫైర్
Follow Us On: X(Twitter)

