బోల్ట్ రికార్డును బద్దలు కొట్టిన రోబోట్..

కలం, స్పోర్ట్స్ :  ప్రపంచ దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ (Usain Bolt) 100 మీటర్ల పరుగులో నెలకొల్పిన 9.58 సెకన్ల ప్రపంచ రికార్డును ఓ హ్యూమనాయిడ్ రోబోట్ అధిగమించింది. బీజింగ్‌లో జరుగుతున్న వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్‌లో చైనాకు చెందిన ‘టియాంగాంగ్ అల్ట్రా’ (Tiangong Ultra) రోబోట్ 100 మీటర్ల పరుగును కేవలం 9.39 సెకన్లలో పూర్తి చేసి సంచలనం సృష్టించింది. ఇదే రేసులో హానర్ సంస్థకు చెందిన ‘లైట్నింగ్’ రోబోట్ 9.47 సెకన్లలో పరుగును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. గత ఎడిషన్‌తో పోలిస్తే టియాంగాంగ్ అల్ట్రా వేగంలో భారీగా పురోగతి సాధించింది. గతంలో ఇదే రోబోట్ 100 మీటర్లను 21.50 సెకన్లలో పూర్తి చేసి విజయం సాధించింది.

హాఫ్ మారథాన్‌లోనూ రోబోట్ రికార్డు

అంతకుముందు ఆదివారం మరో హ్యూమనాయిడ్ రోబోట్ కూడా రికార్డు సృష్టించింది. చైనాకు చెందిన హానర్ స్మార్ట్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సంస్థ రూపొందించిన ‘ఫ్లాష్’ 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌ను 50 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసింది. దీంతో పురుషుల హాఫ్ మారథాన్ ప్రపంచ రికార్డును కూడా అధిగమించింది. ఇంతకుముందు ఈ రికార్డు 57 నిమిషాల 20 సెకన్లుగా ఉంది. బీజింగ్ ఈ-టౌన్ హాఫ్ మారథాన్‌లో చైనా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్‌కు చెందిన 100కు పైగా జట్లు పాల్గొన్నాయి. రోబోట్లు, మనుషులు ఒకే 21 కిలోమీటర్ల మార్గంలో పరుగెత్తగా.. భద్రత దృష్ట్యా వేర్వేరు లేన్లను ఏర్పాటు చేశారు.

రోబోట్లకు రెండు విధానాలు

ఈ ఏడాది పోటీలో రోబోట్లకు రిమోట్ కంట్రోల్, స్వయంచాలక నావిగేషన్ అనే రెండు విధానాలను ప్రవేశపెట్టారు. స్వయంచాలక నావిగేషన్ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేందుకు సుమారు 40 శాతం జట్లు ఈ విధానాన్ని ఎంచుకున్నాయి. రిమోట్ కంట్రోల్‌తో పాల్గొన్న జట్ల సమయానికి 1.2 గుణకం వర్తింపజేశారు. స్వయంచాలక నావిగేషన్‌పై పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ విధానం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

మనుషుల విభాగంలో విజేతలు వీరే

మనుషుల విభాగంలో చైనాకు చెందిన జావో హైజీ పురుషుల టైటిల్‌ను గెలుచుకున్నారు. ఆయన 1 గంట 7 నిమిషాల 47 సెకన్లలో రేసును పూర్తి చేశారు. మహిళల విభాగంలో వాంగ్ కియోషియా 1 గంట 18 నిమిషాల 6 సెకన్లలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచారు. రోబోటిక్స్‌లో వేగం, స్వయంచాలక నావిగేషన్‌ సామర్థ్యాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో ఈ పోటీలు మరోసారి చాటిచెప్పాయి.

Also Read : పంత్ దూకుడు.. గిల్ రికార్డు బద్దలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>