డ్యూరాండ్ కప్ ఛాంపియన్‌గా ఈస్ట్ బెంగాల్!

క‌లం, వెబ్ డెస్క్‌: కోల్‌కతాలో ఈస్ట్ బెంగాల్ (East Bengal) సంచలనం సృష్టించింది. డ్యూరాండ్ కప్ (Durand Cup) 2026 టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో మోహన్ బగాన్‌ను 4-1తో చిత్తు చేసింది. ఈ విజయంతో ఈస్ట్ బెంగాల్ డ్యూరాండ్ కప్ టైటిళ్ల సంఖ్య 17కి చేరింది. దీంతో మోహన్ బగాన్ రికార్డును సమం చేసింది. ఫైనల్ ఆరంభం నుంచే ఈస్ట్ బెంగాల్ దూకుడు చూపించింది. 10వ నిమిషంలో బిపిన్ సింగ్ గోల్ చేశాడు. ఎడమ కాలితో అద్భుతంగా బంతిని గోల్‌లోకి పంపాడు. రెండు నిమిషాలకే ఈస్ట్ బెంగాల్ మరో గోల్ కొట్టింది. 12వ నిమిషంలో ఎడ్మండ్ లాల్రిండికా గోల్ చేశాడు. 23వ నిమిషంలో ఎడ్మండ్ మరోసారి మెరిశాడు. ప్రత్యర్థి డిఫెన్స్‌ను దాటుకుంటూ వెళ్లి అద్భుతమైన గోల్ చేశాడు.

దీంతో ఈస్ట్ బెంగాల్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 34వ నిమిషంలో మోహన్ బగాన్‌కు ఊరట లభించింది. మన్‌వీర్ సింగ్ గోల్ చేసి స్కోరును 3-1కి తీసుకొచ్చాడు. అయితే ఈస్ట్ బెంగాల్ వెంటనే ఆధిపత్యాన్ని తిరిగి సాధించింది. 44వ నిమిషంలో ఎడ్మండ్ మరో గోల్ చేశాడు. దీంతో అతడి హ్యాట్రిక్ పూర్తైంది. తొలి అర్ధభాగం 4-1తో ముగిసింది. రెండో అర్ధభాగంలో మోహన్ బగాన్ గోల్ కోసం ప్రయత్నించింది. కొన్ని అవకాశాలు కూడా సృష్టించింది. కానీ ఈస్ట్ బెంగాల్ డిఫెన్స్ వాటిని అడ్డుకుంది. ఈస్ట్ బెంగాల్‌కు కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి.

అయితే మరో గోల్ మాత్రం నమోదు కాలేదు. చివరికి 4-1తో ఈస్ట్ బెంగాల్ విజయం సాధించింది. ఎడ్మండ్ లాల్రిండికా హ్యాట్రిక్ ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ గెలుపుతో ఈస్ట్ బెంగాల్ మోహన్ బగాన్‌పై టోర్నీలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. కోచ్ ఆంటోనియో లోపెజ్ హబాస్‌కు ఈస్ట్ బెంగాల్‌తో తొలి ట్రోఫీ దక్కింది. మోహన్ బగాన్ 18వ డ్యూరాండ్ కప్ టైటిల్ కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>