అమీన్‌పూర్‌లో వంద కోట్లతో క్యూర్ అర్బన్ స్కూల్స్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన

కలం, మెదక్ బ్యూరో: పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం క్యూర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ఆధునిక వసతులతో క్యూర్ అర్బన్ స్కూల్స్ నిర్మిస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అమీన్ పూర్ (Ameenpur) పరిధిలో నూతన పాఠశాలలకు, కిష్టారెడ్డిపేటలో ఉన్నత పాఠశాల నవీకరణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ఈ క్యూర్ స్కూల్స్ నిర్మాణం ద్వారా ఒకే ప్రాంగణంలో ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఆటస్థలాలు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, అత్యాధునిక ల్యాబ్‌లు, లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>