కడ్తాల్ సర్వీస్ రోడ్డుపై బొలెరో బోల్తా.. తప్పిన పెను ప్రమాదం!

కలం, నిర్మల్: సోన్ మండలం (Soan Mandal ) కడ్తాల్ గ్రామంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం 44వ జాతీయ రహదారి నుంచి కడ్తాల్ గ్రామంలోని సర్వీస్ రోడ్డుపైకి అదుపుతప్పి బోల్తాపడి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 కేవీ విద్యుత్ స్తంభం ధ్వంసమైంది. బొలెరో వాహనం టైరు ఊడిపోయి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో దాని వెనుక భాగం కూడా దెబ్బతిన్నది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని వాహనం ఢీకొట్టిన విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>