కడ్తాల్‌ శ్మశానవాటికకు కొత్త పైప్‌లైన్.. నీటి కష్టాలకు చెక్!

కలం, నిర్మల్ : సోన్ మండలం (Soan Mandal) కడ్తాల్ గ్రామంలోని శ్మశానవాటిక వద్ద నీటి వసతి సరిగాలేక గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం లభించింది. శ్మశానవాటికలో అంత్యక్రియల సమయంలో స్నానాలు చేసేందుకు నీరు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామస్తులు సర్పంచ్ గుర్రం రాము దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల సమస్యపై వెంటనే స్పందించిన సర్పంచ్ శ్మశానవాటిక వద్ద నూతన పైప్‌ లైన్‌ తో పాటు వాటర్ ట్యాంక్‌ ను ఏర్పాటు చేయించారు.

గతంలో ఏర్పాటు చేసిన పైప్‌ లైన్, వాటర్ ట్యాంక్ పూర్తిగా దెబ్బతినడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో అంత్యక్రియల సమయంలో స్నానాలు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని నూతన పైప్‌ లైన్ ఏర్పాటు చేసి, వాటర్ ట్యాంక్‌ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

 Also Read : టాక్సిక్ ఈవెంట్ నిర్లక్ష్యం: మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>