గణాంకాల్లో లోపాలు ఉండొద్దు: నిర్మల్ అదనపు కలెక్టర్లు

కలం, నిర్మల్: సెన్సస్ హ్యాండ్ బుక్ తయారీలో శాఖల వారీగా పూర్తి వివరాలను నిర్దేశిత గడువులోగా సమర్పించాలని నిర్మల్ (Nirmal) జిల్లా అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సెన్సస్ హ్యాండ్ బుక్ రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ.. హ్యాండ్ బుక్ అనేది జిల్లా అధికారిక రికార్డుగా ఉంటుందని, శాఖల వారీగా ఇచ్చే గణాంకాల్లో ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి కచ్చితత్వంతో ఉండాలని స్పష్టం చేశారు.

భవిష్యత్‌లో కీలకంగా..

సెన్సస్ హ్యాండ్ బుక్‌లో పొందుపరిచే సమాచారం పునరావృతం కాకుండా ఉండేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని అదనపు కలెక్టర్లు పేర్కొన్నారు. ఈ సమగ్ర నివేదికలే జిల్లా భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో సరిగ్గా చేర్చడానికి దోహదపడతాయని తెలిపారు. సమాచార సేకరణ, నమోదు ప్రక్రియ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో రాథోడ్ రమేష్, సీపీవో గంగారెడ్డి, డీఈవో భోజన్న, డిప్యూటీ కలెక్టర్ రాకేష్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>