కలం, కరీంనగర్ బ్యూరో: మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు కరీంనగర్ (Karimnagar)లో ఘనంగా జరిగాయి. శనివారం మైత్రి హోటల్‌లో చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్‌రావు కేక్ కట్ చేసి చిరంజీవి అభిమానులకు స్వీట్లు తినిపించారు. అనంతరం అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లతో కలిసి మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా రాజేందర్‌రావు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న సమయంలో చిరంజీవితో కలిసి పనిచేశామని, ఆ రోజుల్లో తమ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని గుర్తుచేశారు. ఆయనతో తమ కుటుంబానికి కూడా మంచి అనుబంధం ఉందని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలో రాబోయే రోజుల్లో మరింతగా రాణించాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుంటూ మెగాస్టార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న,కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గుమ్మడి రాజకుమార్, భాస్కర్ నాయక్, ఆకుల నందిని ఉదయ్, ఇక్రమ్ సికిందర్, కళ్లేపల్లి శారద బాలరాజు, గంటమిడిదొడ్డి కపిల్ మాధవ,గాలిపెళ్ళి కుమార్ శ్రీనివాసు రావనవేని సంపత్, సముద్రాల రమణారావు, జల్లోజు శ్రీనివాస్, పత్యం రాజేష్, వేముల శ్రీనివాసు, సలీం తిప్పారపు శ్రీనివాస్, కనకరాజు, కాసారపు కిరణ్ కుమార్, గండి గణేష్ రాకేష్, సలీం, కోహెడ వేణు, మీసా రమాదేవి కర్రె పావని, పోరండ్ల రమేష్ సత్తినేని శ్రీకాంత్, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

