పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ఆపాలి: SFI

కలం, కరీంనగర్: శక్తి స్కీంను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కమిటీ (SFI Karimnagar) ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీంను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నం. 97ను తీసుకువచ్చి ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇప్పటికే విద్యార్థులకు సరిపడా వసతులు, మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటుపరం చేయడం ఏమిటని ప్రశ్నించారు. డిప్లొమా విద్యార్థులకు బీటెక్‌లో ప్రవేశం పొందేందుకు ప్రస్తుతం ఉన్న అవకాశాలను శక్తి స్కీం ద్వారా దెబ్బతీసే పరిస్థితి ఏర్పడుతుందని విమర్శించారు.

ఈ విధానం వల్ల డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ డిప్లమా విద్యను కాపాడేందుకు జీవో నం. 97ను తక్షణమే రద్దు చేయాలని, శక్తి స్కీంను ఉపసంహరించుకోవాలని SFI కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోగేష్ వినయ్, జిల్లా కమిటీ సభ్యులు మానస, సన్నీ, సందేశ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>