ఓపెన్ స్కూల్‌కు దరఖాస్తు చేసుకోండి: నిర్మల్ డీఈవో

కలం, నిర్మల్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2026-27 అడ్మిషన్ డ్రైవ్‌‌పై శనివారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా విద్యాధికారి (Nirmal DEO) భోజన్న మాట్లాడుతూ.. వివిధ కారణాలతో బడి మానేసిన రైతులు, ఉద్యోగులు, గృహిణులు ఓపెన్ స్కూల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. చేరిన వెంటనే ఉచిత స్టడీ మెటీరియల్, ప్రభుత్వ గుర్తింపుతో సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపారు.

జిల్లాలో 26 స్టడీ సెంటర్లు ఉన్నాయని పేర్కొన్నారు. పదో తరగతికి 14 ఏళ్లు, ఇంటర్‌ చదవడానికి 15 ఏళ్లు నిండిన వారు అర్హులని, గరిష్ఠ వయోపరిమితి లేదన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లా టాస్ సమన్వయకర్త అశోక్, డీపీఎం శోభారాణి, జిల్లా సమన్వయకర్త ప్రవీణ్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు సుచిత్ర, స్టడీ సెంటర్ నిర్వాహకులు, ఏపీఎంలు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>