కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మిక హక్కుల సాధనకై ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల సందర్భంగా సెప్టెంబర్ 6న ఏఐటీయూసీ కార్మిక కవాత్ (AITUC Workers March) నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర కార్యదర్శి సురేష్ తెలిపారు. సెప్టెంబర్ 6,7, 8 తేదీలలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరగనున్న ఏఐటీయుసీ రాష్ట్ర నాలుగవ మహాసభల నేపథ్యంలో కార్మిక ములఖాత్ ప్రచారోద్యమాన్ని శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. కార్మికులు బ్రిటిష్ కాలం నుండే అనేక పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. బ్రిటిష్ ప్రభుత్వ మెడలు వంచి 1923లో ప్రమాద నష్టపరిహార చట్టం, 1926లో ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసుకొని చట్టం, 1936లో వేతనాల చెల్లింపు చట్టం, 1947 లో పారిశ్రామిక వివాదాల చట్టం,1948లో కనీస వేతన చట్టం, 1948లో ఫ్యాక్టరీల చట్టం, 1948 కార్మిక రాజ్యా బీమా చట్టం, 1952లో ప్రావిడెంట్ ఫండ్ చట్టం, 1961 లో ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1965 లో బోనస్ చట్టం, 1970లో కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ చట్టం, ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న కార్మికునికి గ్రాట్యుటీ చెల్లింపు చట్టం, 1986లో బాల కార్మిక వ్యవస్థని చేత చట్టం, 1988లో దుకాణాల సంస్థల చట్టం, 1995లో ఉద్యోగుల పెన్షన్ పథకం, 1996లో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం, 2005లో ఉపాధి హామీ చట్టం, 1961లో అప్రెంటిస్ చట్టం, 1981లో వెహికల్ పొల్యూషన్ కంట్రోల్ చట్టం, 1966 లో బీడీ ఫిగర్స్ వర్కర్స్ యాక్ట్, 1976లో పిడి వర్కర్స్ వెల్ఫేర్స్ సెస్ యాక్ట్, 1923 లో ఇండియన్ అబాలిషన్ యాక్ట్, 1968లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్, 1981లో సినిమా వర్కర్ థియేటర్స్ వర్కర్స్ యాక్ట్, 1948లో కోర్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, 1983లో ఎమిగ్రేషన్ వర్కర్స్ యాక్టు, 1938లో ఎంప్లాయర్ లయాబిలిటీ చట్టం, 1959 లో ఎంప్లాయిమెంట్ ఎంక్లేవ్ యాక్ట్, 1993లో మాన్యువల్ ఎంప్లాయిస్ పెన్షన్స్ స్కీం, 1976లో సమాన పనికి సమాన వేతనం, 1976లో మైగ్రేట్ వర్కర్స్ యాక్ట్, 1946లో లేబర్ వెల్ఫేర్ ఫండ్, 1961లో మోటర్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యాక్ట్, 1963 లో పర్సనల్ ఇన్సూరెన్స్ నష్టపరిహార చట్టం, 1942లో వారాంతపు సెలవులు, 1955లో వర్కర్స్ జర్నలిజం యూనియన్ యాక్ట్ లాంటి దాదాపు 44 కార్మిక చట్టాలను పోరాడి సాధించుకున్న తొలి ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ అని అన్నారు.
మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ లుగా విభజించి 29 కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మే డే స్ఫూర్తితో సాధించుకునే ఎనిమిది గంటల పని దినం పోయి 12 గంటల పని విధానం ప్రవేశ పెట్టారన్నారు. దీంతో కార్మికుల తీవ్ర శ్రమదోపిడీకి గురయ్యే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు కూడా కోల్పోయారని అన్నారు. కార్మిక వర్గం దేశంలో పెను సవాళ్లను ఎదుర్కొంటున్నదని చెప్పారు. కార్మికులు ఎప్పటికప్పుడు మార్క్సిజం వెలుగులో పయనిస్తూ శ్రామిక రాజ్య స్థాపనకై పోరుబాట సాగించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 6న కార్మిక వర్గం పెద్ద ఎత్తున కరీంనగర్ కార్మిక కవాతుకు కదలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు, కార్మికులు రంగన్న, మొగులయ్య, జే.నరసింహ, బాలకోటి, వెంకటన్న, భీమయ్య, అంజలయ్య, శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ, రవి, రాఘవేందర్, యుగంధర్ రెడ్డి, మున్నా, శంకర్, శేఖర్, శ్రీశైలం, రామస్వామి, వసంత, చంద్రకళ, జ్యోతి, అనిత, చెన్నమ్మ, అంజలి, శ్రీదేవి, పద్మ, నిరీక్షణ, నిర్మల, దేవి తదితరులు పాల్గొన్నారు.

