కలం, వెబ్ డెస్క్ : అల్లు వారింట మళ్లీ పెళ్లి సందడి మొదలు కాబోతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ (Allu Sirish) పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. సోమవారం శిరీష్ సోషల్ మీడియా వేదిక గా తన పెళ్లి తేదీపై క్లారిటీ ఇచ్చాడు. అల్లు అర్జున్ పెళ్లి రోజు అయిన మార్చి 6 వ తేదిన శిరీష్ కూడా తన ప్రేయసి నయనిక రెడ్డిని వివాహం చేసుకోబోతున్నాడు.
ఈ న్యూస్ తో అల్లు అభిమానులు ఫుల్ హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోయారు. అన్న బన్నీ వెడ్డింగ్ యానివర్సరీ రోజునే తమ్ముడు కూడా మ్యారేజ్ చేసుకుంటుండడంతో అల్లు వారింట సందడి నెలకొంది. సోషల్ మీడియాలో అల్లు శిరీష్ తన పెద్దన్న కూతురితో పాటు రెండో అన్నయ్య అల్లు అర్జున్ పిల్లలైన అర్హ, అయాన్ తో చేసిన వీడియో షేర్ చేశారు.
ఈ వీడియోలో ట్రెండింగ్ సాంగ్ తో పెళ్లి డేట్ను రివీల్ చేశారు. ఇందులో పిల్లలు పెళ్లెప్పుడు బాబాయ్ అని అడగగా 2026 మార్చి 6 అంటూ అల్లు శిరీష్ చెప్పాడు. అలాగే, సంగీత్ ఎక్కడ అని అడిగితే మనం సౌత్ ఇండియన్స్ అని.. అలాంటివి జరుపుకోమని సైగలు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిది.
కాగా, శిరీష్ తన ప్రియురాలు నయనికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహంలోనే నయనికతో Allu Sirish కు పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధంగా మారబోతోంది.
View this post on Instagram
Read Also: పెద్ది నుంచి జగపతి బాబు లుక్ రిలీజ్.. ఇలా ఉన్నాడేంటి..
Follow Us On : WhatsApp


