కలం, వెబ్ డెస్క్ : సినీ నటి మాధవీలత (Madhavi Latha)పై కేసు నమోదైంది. సాయిబాబా దేవుడు కాదంటూ అవమానించారంటూ ఆమె మీద సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐఆర్ నమోదైంది. రేపు మంగళవారం ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్ కు రావాలంటూ మాధవీలతకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇప్పటి వరకు ఆమె స్పందించలేదు. గతంలో ఆమె ఓ వీడియోలో.. ‘సాయిబాబు అసలు హిందూ దేవుడే కాదు. అతన్ని వైశ్యులు, బ్రాహ్మణులే పూజిస్తారు. షిర్డీ వెళ్లి చూస్తే సాయిబాబా గురించి క్లియర్ గా తెలుస్తుంది.
అతను ఆఫ్ఘాన్ ముస్లిం అని. సాయిబాబా అసలు దేవుడే కాదు. ముస్లింలే ఓపెన్ గా చెబుతుంటారు సాయిబాబాను మేం పూజించం మీరెందుకు పూజిస్తున్నారు అని. కానీ మన వాళ్లు అందరూ సాయిబాబాను గుడ్డిగా నమ్మేస్తున్నారు. శివుడు, రాముడు, వెంకటేశ్వరుడు లాంటి వారి కంటే చాలా మంది సాయిబాబా వల్లే ఏదో మిరాకిల్స్ జరిగాయని నమ్ముతుంటారు. అవన్నీ నిజం కాదు’ అంటూ కాంట్రవర్సీ కామెంట్లు చేసింది మాధవీలత (Madhavi Latha).
Read Also: పెద్ది నుంచి జగపతి బాబు లుక్ రిలీజ్.. ఇలా ఉన్నాడేంటి..
Follow Us On: Youtube


