కలం, వెబ్ డెస్క్ : గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఏడంతస్తుల భవనం ఒక్కసారి కుప్పకూలింది (Building Collapse). 50 గజాల స్థలంలో చేపట్టిన బిల్డింగ్ శనివారం కూలిపోయింది. శిథిలాలు పక్కనున్న అపార్ట్ మెంట్ పై పడడంతో స్పల్పంగా దెబ్బతిన్నది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు.
ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, బిల్డింగ్ యజమాని నాలాను ఆనుకుని అక్రమంగా నిర్మాణం చేపట్టినట్లు సమాచారం.
Also Read : ఆ రెండు భేటీలు అడ్డంకిగా మారాయా? అందుకే సీఎంకు పర్మిషన్ ఇవ్వలేదా!
Follow Us On: X(Twitter)

