కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా దిలావర్ పూర్ మండలం సాంగ్వి గ్రామంలోని గోదావరి తీరాన వెలసిన శ్రీశ్రీశ్రీ మాత అన్నపూర్ణ దేవి ఆలయ వార్షికోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామస్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

