కలం, వెబ్ డెస్క్ : రాజకీయాల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని నాయకులు అనేక రకాల స్టంట్స్ చేస్తుంటారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి తనకు చేతనైన ప్రయత్నాలు చేస్తారు. సింపతి, బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేసి కూడా గెలవడానికి కొందరు ట్రై చేస్తారు. ఈ క్రమంలో ఉత్తరాఖాండ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. హరిద్వార్ జిల్లా లక్సర్ నియోజకవర్గ బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ గుప్తా తనను గెలిపించని వారి కడుపులు పేలిపోతాయని వార్నింగ్ ఇచ్చారు.
తన పుట్టిన రోజువేడుకల్లో వేడుకల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన హయాంలో ప్రాజెక్టులు కట్టించి మంచినీరు అందించానని గుర్తు చేశారు. అయితే, ఆ నీళ్లు తాగుతూ తనకు ఓటు వేయకపోతే ఆ నీళ్లు తాగిన వారి కడుపులో పురుగులు తయారవుతాయని, పొట్టలు పేలిపోతాయని శాపనార్థాలు పెట్టారు. సంజయ్ గుప్తా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీంతో ఓ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సేవ చేసి గెలవాలి తప్పా.. ఇలా బెదిరించడం సరికాదని సూచిస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చర్చనీయాంశంగా మారాయి.

