వలిగొండలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం

కలం, వలిగొండ: శ్రావణ మాసంలో మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే వరలక్ష్మీ వ్రతంతో (Varalakshmi Vratam) వలిగొండ (Valigonda) మండలంలోని లోగిళ్లు పండుగ శోభను సంతరించుకున్నాయి. మహిళలు తెల్లవారుజామునే ఇళ్లను శుభ్రం చేసుకుని, స్నానాలు ఆచరించి వరలక్ష్మీ అమ్మవారిని పసుపు, కుంకుమ, పూలతో అందంగా అలంకరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వ్రతాన్ని ఆచరించారు. పూజల అనంతరం ముత్తైదువులను పిలిచి వాయినాలు అందజేశారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

Also Read : సరిహద్దుల్లో భద్రతపై రాజీ పడబోం: అమిత్ షా

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>