చిత్రసీమలో విషాదం : నటి షావుకారు జానకి కన్నుమూత!

కలం, వెబ్ డెస్క్ : భారతీయ చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (Sowcar Janaki) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 94 ఏళ్లు.

1950లో ఎన్టీఆర్ సరసన ‘షావుకారు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>