రూపా రెడ్డి మృతి ఘటనకు ట్రస్మా సంతాపం

కలం, కోరుట్ల: నల్గొండలో 10వ తరగతి విద్యార్థుల చేతిలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూపా రెడ్డి మేడం మృతి చెందిన ఘటనను తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (TRSMA), కోరుట్ల తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనను నిరసిస్తూ ఉపాధ్యాయ సమాజానికి సంఘీభావంగా TRSMA కోరుట్ల (TRSMA Korutla) ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కార్గిల్ చౌరస్తాలో క్యాండిల్ ర్యాలీ సంతాపం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. TRSMA కోరుట్ల అధ్యక్షులు M. A. బారి మాట్లాడుతూ.. రూపా రెడ్డి మేడంకు న్యాయం చేయాలన్నారు. ఈ ఘటనపై వేగవంతమైన, నిష్పక్షపాత దర్యాప్తు జరిపి న్యాయం చేయాలన్నారు.

ఉపాధ్యాయులు, పాఠశాలల భద్రత కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. ఉపాధ్యాయుల గౌరవం, భద్రత, ప్రతిష్ఠ కోసంతాము ఎల్లప్పుడూ నిలబడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో TRSMA కోరుట్ల అధ్యక్షులు M. A. బారి, కార్యదర్శి గుజ్జెటి వెంకటేష్, కోశాధికారి దీపక్, అలాగే పాఠశాల కరస్పాండెంట్లు సత్యనారాయణ, మహదేవ్, శంకర్, చౌకి రమేష్, దామోదర్, సిద్ధార్థ, రాజేంద్ర ప్రసాద్, సుకుమార్ తదితరులు మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>