హరీశ్ రావు అగ్గిపెట్టె రావు.. పొంగులేటి ఫైర్

కలం, వెబ్ డెస్క్: ప్రతిపక్ష బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) నిప్పులు చెరిగారు. కాళేశ్వరం, ధరణి నుండి మెడికల్ కాలేజీల వరకు అన్నింటిలోనూ దోచుకున్న బీఆర్ఎస్ నేతలు.. తమ ప్రభుత్వాన్ని కమిషన్ల ప్రభుత్వమని మాట్లాడటం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీగా కూడా బీఆర్ఎస్ ఫెయిల్ అయిందని ఆగ్రహించారు. ప్రతిపక్షం హోదాలో ఉండి అబద్దాలను పదే పదే చెబుతూ ఆందోళనకు తెరలేపాడమే తప్ప బీఆర్ఎస్ నేతల వల్ల ప్రజలకు ఏలాంటి ఉపయోగం లేదన్నారు.

కమిషన్ల గురించి, అవినీతి గురించి ఆ పార్టీ నేత హరీశ్ రావు మాట్లాడుతుంటే హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందని విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తమ అవినీతిపై కేసీఆర్ కుమార్తె కవిత అనేక సందర్భాల్లో మాట్లాడిన సంగతి మర్చిపోతే ఎలా హరీశ్ రావు? అంటూ దుయ్యబట్టారు. అవినీతి గురించి హరీశ్ నీతి వాక్యాలు చెబుతుంటే బీఆర్ఎస్ నేతలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రబ్బరు చెప్పులతో తిరిగిన అగ్గిపెట్టె రావు అంటూ విమర్శించారు.

పదేండ్లలో విచ్చలవిడిగా దోచుకుని.. తరతరాలకు తిన్నా తరగని డబ్బు సంపాదించుకున్నారని ఆరోపించారు. తమ ఆర్థిక పరిపుష్టికి అవినీతే కదా ఆధారం అంటూ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో కమీషన్ల మీద పనులు జరిగినట్టు ఈ ప్రభుత్వంలో కూడ జరుగుతుందనుకోవడం తమ భ్రమ అని.. దీనిని ప్రజలమీద రుద్దకండి అంటూ విమర్శించారు. ఆనాడు అధికారంలో ఉండి పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యారని.. నేడు ప్రతిపక్ష పార్టీగా కూడా బీఆర్ఎస్ పార్టీ పనికిరాదని నిరూపిస్తున్నారని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>