కలం, వెబ్ డెస్క్ : విద్యార్థులు తప్పు చేస్తే సున్నితంగా దండించాల్సిన టీచర్ ఓ ఆరేళ్ల బాలుడు ప్రాణాలు పోయేలా కొట్టాడు. విఖాపట్నం (Visakhapatnam) లోని లిటిల్ గార్డెన్ స్కూల్ లో ఈ దారుణం జరిగింది. హోం వర్క్ చేయలేదని టీచర్ బెదిరించి.. మందలించడంతో ప్రణయ్ రాజ్ (6) భయాందోళనకు గురయ్యాడు. గుక్కపెట్టి ఏడుస్తూ బాలుడు క్లాస్ రూమ్ లోనే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న ప్రణయ్ రాజ్ తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

