కలం, నిర్మల్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna Goud) చూపిన పోరాట పటిమ, ధైర్యసాహసాలు, ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ (Kishore Kumar) అన్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి బహుజన రాజ్య స్థాపనకు కృషి చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. మొఘల్, కుతుబ్షాహీ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలను, బహుజనులను ఏకం చేసి సైన్యాన్ని ఏర్పాటు చేసి పోరాటం సాగించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రాథోడ్ రమేష్, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ శంకర్, ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

