ఈ–సిగరెట్ల దందాపై ఈగల్ పోలీసుల కొరడా

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని మాదాపూర్‌ (Madhapur)లో ఈ-సిగరెట్ల దందాపై ఈగల్ పోలీసులు కొరడా ఝళిపించారు. స్మోకిన్ స్పాట్, హోలీ స్మోక్ షాపుల్లో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నారంటూ ఈగల్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడ సోదాలు జరిపిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 92 నిషేధిత వేప్స్, 15 విదేశీ సిగరెట్ ప్యాకెట్లు, రెండు స్కానర్లు స్వాధీనం చేసుకున్నారు. స్మోకిన్ స్పాట్ యజమాని మెయిద్దీన్‌గా గుర్తించారు. అతడు వేరే రాష్ట్రంలో ఉండగా.. ఇద్దరు వ్యక్తులు షాపులో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. వారి ఫోన్లు చెక్ చేయగా.. వాట్సాప్ గ్రూపుల నెట్‌వర్క్ బయటపడింది.

ర్యాపిడో ద్వారా డెలివరీలు..

వాట్సాప్, ఇన్ స్టా యాప్‌ల్లో తమ వద్ద ఈ-సిగరెట్లు ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రధానంగా రెండు బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. ర్యాపిడో ద్వారా డెలివరీలు సైతం చేస్తున్నట్లు తెలుసుకుని షాకయ్యారు. మరో షాపు హోలీ స్మోక్ యజమాని అబ్దుల్ రషీద్ కేరళ నుంచి ఈ-సిగరెట్లను తెప్పించి విక్రయిస్తున్నట్లు తేల్చారు. ఇతను ఫిబ్రవరిలో కూడా ఇలాంటి కేసులోనే అరెస్టయి.. జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకొచ్చాడు. అయినా తీరు మార్చుకోకుండా మళ్లీ ఈ-సిగరెట్లను విక్రయిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం రెండు షాపుల యజమానులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>