ప్రపంచ నంబర్ వ‌న్‌కు షాక్.. ఆయుష్ సంచలనం!

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్రపంచ బ్యాడ్మింటన్ వేదికపై భారత యువ సంచలనం ఆయుష్ శెట్టి (Ayush Shetty) అద్భుతం సృష్టించాడు. న్యూఢిల్లీలో జరుగుతున్న BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, ప్రపంచ నంబర్ 1 ఆటగాడు చైనాకు చెందిన షి యుకీని ఓడించి సంచలనం సృష్టించాడు. సంచలన విజయం21 ఏళ్ల ఆయుష్ శెట్టి రాండ్ ఆఫ్ 64 మ్యాచ్‌లో 21-14, 13-21, 21-19 తేడాతో విజయం సాధించాడు. సొంత అభిమానుల మధ్య అద్భుతమైన స్మాష్‌లు, డిఫెన్స్‌తో రాణించాడు. గతంలో షి యుకీ చేతిలో వరుసగా మూడుసార్లు ఓడిపోయిన ఆయుష్‌కు, అతనిపై ఇది తొలి విజయం.

తొలి గేమ్‌ను 21-14తో గెలుచుకున్న ఆయుష్, రెండో గేమ్‌ను కోల్పోయాడు. అయినా వెనక్కి తగ్గకుండా మూడో గేమ్‌లో పోరాడి విజయాన్ని అందుకున్నాడు.ఆయుష్ ప్రస్థానంకర్ణాటకలోని కార్కళ సమీపంలో ఉన్న సాణూర్ ఆయుష్ స్వగ్రామం. ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి మార్గదర్శకత్వంలో ఇంటి వెనుక ప్రాంగణంలో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించాడు. శిక్షణ కోసం కుటుంబం బెంగళూరుకు మారింది. అక్కడ ప్రకాష్ పడుకోన్ బ్యాడ్మింటన్ అకాడమీలో మెరుగైన నైపుణ్యాలు సాధించాడు.

గతంలో డెన్మార్క్ జూనియర్ ఇంటర్నేషనల్ (2021) గెలిచిన ఆయుష్, 2023 ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించాడు. ఒడిశా మాస్టర్స్, బహ్రెయిన్, డచ్ ఓపెన్‌లలో రన్నరప్‌గా నిలిచాడు.2025లో యుఎస్ ఓపెన్ గెలిచి తన తొలి BWF వరల్డ్ టూర్ టైటిల్ సాధించాడు. ఈ ఏడాది ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరి 61 ఏళ్ల రికార్డును తిరగరాశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>