బాలాపూర్‌లో దారుణం: పెళ్లి చేసుకోమన్నందుకు.. చంపేశాడు!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ బాలాపూర్ (Balapur) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ప్రియుడే దారుణంగా హత్య (Murder) చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ కు చెందిన రెహానా అనే యువతి బాలాపూర్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో పనిచేస్తుంది. ఆమెకు మహ్మద్ సలామ్ అనే యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై గర్భవతిని చేశాడు. ప్రస్తుతం ఆమె 2 నెలల గర్భవతి. గర్భం దాల్చడంతో తనను త్వరగా పెళ్లిచేసుకోవాలని మృతురాలు (రెహానా) మహ్మద్ సలామ్ ను ఒత్తిడి చేసింది.

దీంతో ఆమె అడ్డును ఎలా అయినా తొలగించుకోవాలని సలామ్ పథకం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను కత్తితో కిరాతకంగా పొడిచి హత్యచేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం కలగకుండా ఉండేందుకు గోనెసంచిలో మూట కట్టి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తును వేగవంతం చేశారు. వీరిద్దరూ బీహార్ రాష్​ట్రానికి చెందిన వారుగా గుర్తించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>