కలం, వెబ్ డెస్క్: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పాన్ ఇండియా హీరోల్లో ఒకరు. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మెగా హీరోకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం సినీ ఇండస్ట్రీ నుంచే కాకుండా ఇతర రంగాల వారితోనే మంచి పరిచయాలున్నాయి. ఏమాత్రం సమయం దొరికిన స్నేహితులో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. సల్మాన్ ఖాన్ బర్త్ డే వేడుకల్లోనూ రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.
బాలీవుడ్ కండల వీరుడుతో రామ్ చరణ్‌కు మంచి బాండింగ్ ఉంది. సల్మాన్ (Salman Khan) ఆహ్వానం మేరకు రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు. చరణ్ సల్మాన్‌తోపాటు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనితో కలిసి ముచ్చటించారు. సరాదాగా కబ్లురు చెప్పుకుంటూ జోష్ నింపారు. బాబీ డియోల్‌ను కూడా కలిశాడు. ఒకే ఫ్రేమ్‌లో సల్మాన్, ధోని, రామ్ చరణ్ కనిపించడంతో ‘టైటాన్’ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రామ్ చరణ్ (Ram Charan) బుచ్చి బాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని మార్చి 27, 2026న విడుదల కానుంది. అయితే చికిరి చికిరి సాంగ్‌కు భారీ క్రేజ్ వచ్చింది. ఈ పాటలో చరణ్ బ్యాట్ పట్టిన దృశ్యాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బహుశా ధోని (Dhoni) నుంచి రామ్ చరణ్ సలహాలు తీసుకోవచ్చునని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Read Also: పెళ్లి తేదీ ప్రకటించిన అల్లు శిరీష్
Follow Us On: Youtube


