కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కలం, ములుగు: ములుగు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీతక్కకు తనకు రక్త సంబంధం లేకపోయినా సోదరి కంటే ఎక్కువ చూస్తుంటానని.. కానీ, ఆస్తి ఎక్కడ ఇవ్వాల్సి వస్తోందనని సొంత సోదరిని ఒకరు ఇంటి నుంచి వెళ్లగొట్టారని కేటీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. కుమారుడికి మంచి చెప్పాల్సిన తండ్రి ఫాం హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు.

తండ్రి కుమారులను మించి మేనల్లుడు అఘోరా రావు తెలంగాణలో కరువు రావాలని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి అఘోర, క్షుద్ర పూజలు, చేత బడులు చేస్తున్నారని హరీశ్ రావును (Harish Rao) ఉద్దేశించి సీఎం రేవంత్ ఆరోపించారు. అధికారం కోల్పోతే ఎవరైనా చావు కోరుకుంటారా.. వీరు ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా.. ప్రశ్నించారు. ఎవరెన్ని చేసినా దేవుడు తమ వైపే ఉన్నాడని.. మంచి పరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

రూ.868 కోట్ల పనులకు శ్రీకారం…

ములుగు జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) భారీ అభివృద్ధి వరాలు ప్రకటించారు. రూ.63.50 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తగా మంజూరైన పింఛన్లకు సంబంధించిన పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో హ్యామ్‌ విధానంలో చేపట్టనున్న 2,145 రహదారుల అభివృద్ధి పనులకు సీఎం ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. మొత్తం 7,448 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో ఈ భారీ ప్రణాళికను చేపట్టనున్నారు. ములుగు గట్టమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు.

 

Also Read : స్మార్డ్ రేష‌న్ కార్డుపై మోదీ ఫోటో పెట్టాల్సిందే: బోయినపల్లి ప్రవీణ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>