బండ్ల గణేష్ కుమార్తె వివాహంలో సీఎం సందడి!

కలం, వెబ్ డెస్క్​ : ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక (Bandla Ganesh Daughter Wedding) కోలాహలంగా జరిగింది. ఈ శుభకార్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. వేడుక ప్రాంగణానికి చేరుకున్న సీఎంకు బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంత‌రం బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో సీఎం ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read : తిరుమలకు తీసిపోని తిరుమలయ్య గుట్ట..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>