కేవలం రూ.16కే డ్రెస్.. ఎగబడ్డ జనాలు.. ఎక్కడంటే?

కలం, వెబ్ డెస్క్: కస్టమర్లను ఆకర్షించేందుకు ఓ వస్త్ర వ్యాపారి ప్రకటించిన ఫ్లాష్ సేల్‌ తీవ్ర ఉద్రిక్తతకు, గందరగోళానికి దారితీసింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ (Kanpur)లో వస్త్ర వ్యాపారి రయీస్ ఆలం.. తన పుట్టిన రోజు సందర్భంగా ఏ వస్త్రం కొనుగోలు చేసినా కేవలం రూ.16కే ఇస్తామని ఆఫర్ ప్రకటించారు. అయితే ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం 16 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.

ఈ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో ప్రజలు ఒక్కసారిగా దుకాణం వైపు పరుగులు తీశారు. ఒక్కసారిగా వందలాది మంది జనం దుకాణం ముందు గుమిగూడడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి శాంతి భద్రతల సమస్యకు దారితీసే అవకాశం ఉందని భావించిన పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించి వ్యాపారి రయీస్ ఆలంపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. కాగా, ఫ్లాష్ సేల్ ఆఫర్ కోసం జనాలు రోడ్లపై ఎగబడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : విమల్ యాడ్‌ ఎఫెక్ట్.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>