స్వాతంత్య్ర దినోత్సవం రోజు చిల్లర మాటలా?.. హరీశ్ రావు ఫైర్

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు చిల్లర మాటలా? అంటూ రేవంత్ర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాను మాట్లాడేందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోందన్నారు. సంగారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ (Revanth Reddy).. జిల్లాకు రూపాయి నిధులైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు.

జిల్లాకు ఏం చేశారు?

సంగారెడ్డి ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏమి చెప్పుకునేందుకు లేకనే ఇలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందుకు 420 హామీలు ఇచ్చారని.. ఇప్పుడు 420 మాటలు మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో ప్రాజెక్టుల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేదని విమర్శించారు. జిల్లాలోని సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనుల ఊసే ఎత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఒక్క కిలోమీటర్ రోడైనా వేశారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంగారెడ్డి జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

చర్చకు సిద్ధమా?

కేసీఆర్ ప్రభుత్వంలో కంటే రెండు ఏళ్లలో రేవంత్ రెడ్డి రూ. 15,000 కోట్ల రైతుబంధు ఎగ్గొట్టాడని హరీశ్ రావు దుయ్యబట్టారు. రుణమాఫీ, ఉచిత కరెంట్, ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ పై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. గాంధీని, పటేల్, నెహ్రూ లాంటి మహనీయులను తలచుకోవాల్సిన రోజున, రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. నాడు కేసీఆర్ ఆగస్టు 15న అభివృద్ధి, సాగునీరు, విద్యుత్ గురించి మాట్లాడేవారు కానీ.. రేవంత్ రెడ్డి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి కూడా సంగారెడ్డిలో చెప్పలేదని దుయ్యబట్టారు.

రేవంత్ రెడ్డికి సవాల్..

కాంగ్రెస్‌ ఇచ్చిన ఉద్యోగాలపై చర్చకు సిద్ధమని హరీశ్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీలో 16 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి.. ఇప్పుడు 79 వేల ఉద్యోగాలు అని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు. గన్‌మెన్‌ లేకుండా దిల్‌సుఖ్‌నగర్‌ కోచింగ్‌ సెంటర్‌, ఓయూ, అశోక్‌ నగర్‌ సెంట్రల్‌ లైబ్రరీకి సీఎం రేవంత్‌ రావాలన్నారు. లేకపోతే విద్యార్థులకు రేవంత్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>