బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ నిర్వీర్యం చేసింది.. కేటీఆర్ ఫైర్

కలం, వెబ్ డెస్క్: రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ హాయంలో ప్రవేశబెట్టిన కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, రైతు బీమా పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేస్తున్నది తెలంగాణ కోసం కాదని.. తన కుటుంబం, బంధువులు, అనుచరుల కోసం అంటూ ఆరోపించారు.

తెలంగాణలో అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్పడం మాత్రమే కాదని, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెబుతున్నారని అన్నారు. రేవంత్ సర్కార్ అవినీతిని సొంత పార్టీ ఎమ్మెల్యేలే బట్టబయలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తాము చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టిపారేస్తూ వచ్చిందని.. ఇప్పుడు అదే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల నోటి నుంచి వస్తున్నాయని అన్నారు.ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ, ఏఐసీసీకి ఏటీఎంగా మార్చుకున్నారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ సైతం తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ రాష్ట్రం ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని స్వయంగా ప్రధాని మోడీ నుంచే ఆరోపణలు వస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>