స్త్రీ శ‌క్తి స్కీమ్‌కు ఏడాది పూర్తి.. బ‌స్సులో సీఎం జ‌ర్నీ!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ స‌ర్కార్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం (Sthree Shakti Scheme) నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తిలో నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు (Chandrababu) పాల్గొన్నారు. ‘స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం ఆర్టీసీ బ‌స్సులో మ‌హిళ‌ల‌తో క‌లిసి ప్ర‌యాణించారు.

పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ మీదుగా సీఎం క్యాంప్ కార్యాలయం వరకు చంద్ర‌బాబు (Chandrababu) బ‌స్సు ప్ర‌యాణం సాగింది. స్త్రీశక్తి పథకం అమలు తీరు, దానివల్ల తమ జీవితాల్లో వచ్చిన మార్పులు, కుటుంబ ఆర్థిక స్థితిగతుల గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఒక మహిళా రైతుతో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సమాజంలో మహిళలు స్వయం సమృద్ధి సాధించినప్పుడే రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని సీఎం స్పష్టం చేశారు. ఈ ఉచిత ప‌థ‌కంతో మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.4,000 ఆదా చేస్తున్నామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

Also Read : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​‌కు తీవ్ర అస్వస్థత

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>