epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

లంకపై భారత్ జైత్రయాత్ర: నాలుగో టీ20లోనూ ఘనవిజయం

కలం, వెబ్​ డెస్క్​ : శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల (India Women) జట్టు తన విజయయాత్ర కొనసాగిస్తోంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన టీ20 నాలుగో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుతమైన ప్రదర్శనతో శ్రీలంకపై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. భారత్(India) 30 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 4-0తో ఆధిక్యం సాధించి, క్లీన్ స్వీప్​ పై కన్నేసింది. శ్రీలంక కెప్టెన్ చమారి అతపత్తు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు.

భారత ఓపెనర్లు స్మృతి మంధాన 80 నాటౌట్ (48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫాలీ వర్మ 79 (46 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టారు. ఇద్దరూ కలిసి 162 పరుగుల భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు . ఈ ఇన్నింగ్స్‌తో స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగుల మైలురాయిని సాధించారు. చివరి దశలో రిచా ఘోష్ 40 నాటౌట్ (16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ హిట్టింగ్‌తో స్కోరును భారీగా పెంచింది. భారత్ 20 ఓవర్లలో 221/2 చేసింది. శ్రీలంక బౌలర్లు పూర్తిగా నిరాశపరిచారు. ఎక్కువ మంది బౌలర్ల ఎకానమీ రేటు 10కు పైగా నమోదైంది.

పోరాడి ఓడిన శ్రీలంక..

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 191/6 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ చమారి అతపత్తు (52) అర్ధ సెంచరీతో రాణించినప్పటికీ, ఇతర బ్యాటర్లు ఆశించిన స్థాయిలో వేగంగా ఆడలేకపోయారు. హసిని పెరెరా 33, ఇమేషా దులాని 29 పరుగులు చేశారు. అయితే మిడిల్ ఓవర్లలో స్కోరు రేటు పడిపోవడంతో చివరి 5 ఓవర్లలో 83 పరుగులు కావాల్సి ఉండగా వారు విఫలమయ్యారు. భారత(India) బౌలర్లు అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, శ్రీ చరణి కీలక సమయాల్లో వికెట్లు తీసి లంకను కట్టడి చేశారు.

Read Also: పాక్‌ టీమ్‌లోకి షాదాబ్ రీఎంట్రీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>