కలం, వెబ్ డెస్క్ : అనసూయ అస్సలు తగ్గట్లేదు. మళ్లీ ట్రోలర్స్ పై రెచ్చిపోయింది. శివాజీ కామెంట్లపై అనసూయ (Anasuya) ఎంతగా ఫైర్ అవుతుందో చూస్తున్నాం. ఈ క్రమంలోనే ట్రోలర్స్, నెటిజన్లు సోషల్ మీడియాలో అనసూయపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు నెగెటివ్ గా పోస్టులు పెడుతున్నారు. ఇలా పోస్టులు పెడుతున్న వారిపై తాజాగా అనసూయ (Anasuya) ఫైర్ అయింది. ఓ రెండు పోస్టులకు ఆమె రిప్లై ఇచ్చింది. అనసూయ జబర్దస్త్ షోలో డార్క్ కామెడీ చేసి పాపులర్ అయి ఇప్పుడు ఇలా మాట్లాడుతోందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి ఆమె రిప్లై ఇస్తూ.. ‘మీరు అంత మూర్ఖులా. అది షోలో చేసిన కామెడీకి రియల్ క్యారెక్టర్ కు తేడా మీకు తెలియదా. సినిమాల్లో హీరోలు విలన్లను చంపేస్తాం అంటే నిజంగానే చంపేస్తారా. ఆ మాత్రం తెలుసుకోకుండానే మాట్లాడుతారా’ అంటూ రిప్లై ఇచ్చింది.
మరో నెటిజన్.. ‘అనసూయ ఆఫర్ల కోసం చాలా పనులు చేసింది. ఆమె ఇలా మాట్లాడటాన్ని పెద్దగా పట్టించుకోవద్దు’ అన్నాడు. దానికి అనసూయ రిప్ల ఇస్తూ.. ‘సార్ సార్.. అసలు ఆఫర్ల కోసం నేనేం చేశానో కొంచెం చెప్పండి. ఆ దమ్ము మీకు ఉందా. ఎందుకంటే నేనేం చేశానో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది’ అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇలా ఆమె ట్రోలర్స్ పై తగ్గేదే లే అన్నట్టు కౌంటర్లు వేస్తోంది.
Read Also: ‘టాక్సిక్’లో ఎలిజిబెత్ గా హుమా ఖురేషి.. ఫస్ట్ లుక్ రిలీజ్
Follow Us On: Youtube


