epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘టాక్సిక్’లో ఎలిజిబెత్​ గా హుమా ఖురేషి.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్

కలం, వెబ్​ డెస్క్​ : రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్ : ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’  సినిమా (Toxic movie) పై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ సినిమాలో ఎలిజిబెత్ పాత్ర‌లో న‌టిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. వైవిధ్య‌మైన పాత్రలను ఎంచుకుంటూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న‌ హుమా ఖురేషి.. టాక్సిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం సినిమా పై ఆసక్తిని మరింత పెంచింది. ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే.. ఆమె పాత్రలో మిస్టరీ, ఇంటెన్సిటీ అర్థ‌మ‌వుతోంది. 2026లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ పై లేటెస్ట్‌గా హుమా ఖురేషి (Huma Qureshi) ఫస్ట్ లుక్‌తో బజ్ మరింత పెరిగింది. హుమా ఖురేషి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఆమె బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్ వేసుకుని ఓ వింటేజ్ బ్లాక్ కారు ముందు నిలుచుని ఉంది. వెనుక మైపు సమాధి రాళ్లు, రాతి దేవదూత విగ్రహంతో శ్మ‌శానం ఉన్న ఆన‌వాళ్లు క‌నిపిస్తున్నాయి. ఈ తరహా బ్యాక్‌డ్రాప్ ఒక భయానకమైన వాతావరణాన్ని త‌లపిస్తోంది.

‘ఎలిజబెత్’ పాత్రకు ప్రాణం పోసేలా చేసింది

చిత్ర ద‌ర్శ‌కురాలు గీతూ మోహ‌న్ దాస్ హుమా ఖురేషి పాత్ర గురించి త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తూ..‘“ఈ పాత్రకు ఎవ‌ర్ని ఎంపిక చేయాలా అనేది నాకు చాలా క‌ష్టంగా అనిపించింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్‌లో న‌టించే వారి న‌ట‌నా సామ‌ర్థ్యం, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఓ డిఫ‌రెంట్ లుక్ తీసుకు రావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే హుమా నా ఫ్రేమ్‌లోకి అడుగుపెట్టిందో.. ఆ క్షణం నుంచే ఆమెలో ఏదో ప్రత్యేకమైన, అరుదైన గుణం ఉందని గమనించాను. ఆమె సహజమైన స్టైల్‌, ఇంటెన్సిటీ, ‘ఎలిజబెత్’ పాత్రకు ప్రాణం పోసేలా చేసింది. హుమా ఒక అద్భుత‌మైన న‌టి.. ఆమె త‌న పాత్ర ద్వారా ఒక ప్రశ్నలు వేసే, లోతుగా ఆలోచింప చేస్తాయి. స‌ద‌రు పాత్రను ఎంత గొప్ప‌గా చూపించాల‌నే స‌వాల్‌ను క‌లిగించే న‌టి. ఈ ప్ర‌యాణంలో ఆమెతో చేసిన చ‌ర్చ‌, మా క్రియేటివ్ జర్నీలో ఎంతో కీల‌కంగా మారింది. హుమా ఓ టాలెంటెడ్ ప‌వ‌ర్ హౌస్‌. ఈ పాత్రతో ఆమె వెండితెర‌ పై ఒక డిఫ‌రెంట్‌, స్ట్రాంగ్, ఎఫెక్టివ్ వ్య‌క్తిత్వాన్ని ఎలివేట్ చేసింది. ఐ ల‌వ్ యు హుమా ఖురేషి అని స్పందించారు.

సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఓ ఫైర్ అవుతుంది

టాక్సిక్(Toxic movie) లో ఎలిజిబెత్ పాత్ర గురించి హుమా ఖురేషి త‌న సోష‌ల్ మీడియాలో స్పందిస్తూ.. ‘ఇలాంటి ఓ క‌థ‌ను నువ్వు మాత్రమే క‌ల‌గ‌న‌వు. నిన్ను మొద‌టిసారి ఈ సినిమాకు సంబంధించి మాట్లాడే క్ర‌మంలో కాఫీకి క‌లుసుకున్న‌ప్పుడు.. నీ విజ‌న్‌ను చూసి.. టాక్సిక్ సినిమా కోసం మనం చేయ‌బోయే సాహసాన్ని, ఎవ‌రూ ఊహించని దాన్ని మ‌నం వెండితెర‌ పై చూపించ‌బోతున్నామ‌నే ఆలోచ‌న‌ చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. నా కెప్టెన్‌గా నువ్వు ప్ర‌తిరోజూ దీనికి ప్రాణం పోసిన తీరు ఓ మాయాజాలంలా అనిపించింది. నాకు ఎలిజబెత్ అనే బహుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు, అలాగే ఇది సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఓ ఫైర్ అవుతుంది. ఇది నేరవేరేలా చేసిన తిరుగులేని శ‌క్తి య‌ష్‌కు థాంక్స్‌ అని చెప్పారు. ఈ భారీ చిత్రం 2026 మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్‌ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Read Also: మీరు అంత మూర్ఖులా.. ట్రోలర్స్ పై అనసూయ ఫైర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>