కలం, హనుమకొండ: తన కలంతో ప్రజా గొంతుగా నిలిచిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ ధిక్కార స్వరమని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె.నారాయణ (K Narayana) అన్నారు. శుక్రవారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రాన్ని రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి సందర్శించారు. కాళోజీ విగ్రహానికి నివాళులర్పించి, ఆయన దుస్తులు, కవితల పుస్తకాలను పరిశీలించారు. 2014లో శిలాఫలకం వేసిన అప్పటి ప్రభుత్వం కళాక్షేత్రాన్ని పూర్తి చేయడంలో విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, మేకల రవి, పంజాల రమేష్, ఎన్.ఏ.స్టాలిన్ పాల్గొన్నారు.
Also Read : రాహుల్ గాంధీకి షాక్.. నోటీసులు జారీ!
Follow Us On : WhatsApp

